తన విలన్ గురించి హింట్ ఇస్తున్న రాజమౌళి !

తన విలన్ గురించి హింట్ ఇస్తున్న రాజమౌళి !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ లతో భారీ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే.  కొంత వరకు షూటింగ్ కూడ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో విలన్ పాత్రను ఎవరు చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  కొందరైతే ఇందులో 'కేజిఎఫ్' సినిమా హీరో యాష్ నటిస్తాడని అన్నారు.  ఆ తరవాత అవన్నీ రూమర్స్ అని ఇంకొందరన్నారు.  

కానీ ఇప్పుడు ఈ వార్తే నిజమేమోనని అనిపిస్తోంది.  ఎందుకంటే 'కేజిఎఫ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నెల 9న జరగనుంది.  ఈ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.  దీన్నిబట్టి తన  సినిమాలో యాష్ ను ప్రతినాయకుడిగా తీసుకోవాలనే ఆలోచన జక్కన్న మదిలో ఉందని, అందుకే అతని సినిమా వేడుకకు అతిథిగా వెళుతున్నారని అనిపిస్తోంది.