రాజమౌళి సింపుల్ గా వదిలేశాడేంటి..!!

రాజమౌళి సింపుల్ గా వదిలేశాడేంటి..!!

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీకి సంబందించిన టైటిల్ ను రిలీజ్ చేశారు.  రాజమౌళి సినిమా టైటిల్ రిలీజ్ భారీ ఎత్తున ఉంటుందేమో అనుకున్నారు. భారీ సెట్స్ వేసి.. అందరిని పిలిచి రిలీజ్ చేస్తారేమో అని ఎదురు చూస్తే.. సింపుల్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేసి సైలెంట్ అయ్యారు.  దీన్ని కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పీఆర్ లు ట్విట్టర్ అకౌంట్స్ లో పోస్ట్ చేశారు.  రాజమౌళి ట్విట్టర్ హ్యాండిల్ లో టైటిల్ కు సంబంధించిన సమాచారం లేదు.  

టైటిల్ కూడా గ్రాంధికంగా ఉండటంతో మాస్ ప్రేక్షకులకు ఎక్కుతుందా అన్నది సందేహం.  బాహుబలి నాలుగు అక్షరాలా మాట సింపుల్ ఉంది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ తో చేస్తున్న రామ రౌద్ర రుషితం టైటిల్ అర్ధంగానట్టుగాను, కన్ఫ్యూషన్ గాను ఉన్నది. టైటిల్ అర్ధం గురించి మాస్ ప్రేక్షకులకు అక్కర్లేదు కదా.  టైటిల్ ఎంత ఫోర్స్ తో ఉన్నది చూస్తారు.  టైటిల్ ఎలాగో రివీల్ అయ్యింది కాబట్టి.. ఆ లుక్స్ పై ఆసక్తి మొదలైంది.  చూద్దాం ఎలా ఉంటుందో.  రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు నటిస్తున్న సినిమా కాబట్టి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. వచ్చే ఏడాది జులై 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.