తిరుమ‌ల‌లో కొండెక్కిన అఖండ దీపం..? క్లారిటీ ఇచ్చిన టీటీడీ

తిరుమ‌ల‌లో కొండెక్కిన అఖండ దీపం..? క్లారిటీ ఇచ్చిన టీటీడీ

క‌రోనా వేగంగా విస్తరించడం... ఆ తర్వాత లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తిరుమలలోని శ్రీవారి ఆలయం సహా దేశం లోని ప్రముఖ ఆలయాలు మూతపడ్డాయి... అయితే తిరుమలలో భక్తులను దర్శనానికి అనుమతించక పోయినా... స్వామివారికి నిత్యం నిర్వహించే పూజలు మాత్రం కొనసాగుతూనే వున్నాయి. ఇక ఇదే సమయంలో తిరుమ‌ల‌పై సోష‌ల్ మీడియాలో పలు వదంతులు సృష్టించారు. అందులో ఒక్కటి తిరుమ‌ల‌లో అఖండ దీపం కొండెక్కింద‌నే ప్ర‌చారం వీప‌రితంగా జ‌రుగుతుంది. అయితే.. ఈ వ‌దంతుల‌ను టీటీడీ కొట్టిపారేసింది. వీటిపై వివ‌ర‌ణ ఇచ్చారు తిరుమ‌ల శ్రీవారి మాజీ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ దీక్షితులు. సుప్ర‌భాతం నుంచి ఏకాంత‌సేవ వ‌ర‌కు అఖండ‌దీపం వెలుగుతూనే ఉంటుంద‌ని, అన్ని సేవ‌లు కూడా స్వామివారికి జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు. భ‌క్తులు ఎలాంటి వ‌దంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు ర‌మ‌ణ దీక్షితులు. మొత్తానికి సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారానికి టీటీడీ ఇలా పులిస్టాప్ పెట్టింది.