నారా.. రానా.. అచ్చు గుద్దినట్టు ఒకేలా !

నారా.. రానా.. అచ్చు గుద్దినట్టు ఒకేలా !

ఒక దర్శకుడు ఎవరిదైనా బయోపిక్ తీస్తున్నాడంటే అందులోని వాస్తవ పాత్రల కోసం నటీనటుల్ని ఎంచుకోవడంలోనే అతని ప్రతిభ ఏమిటనేది స్పష్టమైపోతుంది.  ప్రస్తుతం దర్శకుడు క్రిష్  బాలక్రిష్ణ  ప్రధాన పాత్రలో రూపొందిస్తున 'ఎన్టీఆర్' చిత్రంలో అతి ముఖ్యమైన నారా చంద్రబాబు నాయుడుగారి పాత్ర కోసం రానాను ఎంచుకున్నారు. 

యుక్త వయసులో చంద్రబబు ఎలా ఉండేవారో అచ్చు అలానే ఉండేలా రానాకు మేకోవర్ చేయించారు క్రిష్.  కొద్దిసేపటి దానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.  ఆ లుక్ చూస్తుంటే 80 ల దశకంలోని చంద్రబాబుని చూసినట్టే ఉంది.  అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు రానా.  ప్రేక్షకుల నుండి దీనికి మంచి ప్రశంసలు అందుతున్నాయి.  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరులతో కలిసి బాలక్రిష్ణ నిర్మిస్తున్నారు.