వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ
అనుకున్నట్లే ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. నిధుల ప్రవాహం అధికంగా ఉందని.. దానిని కట్టడి చేయాలని భావించిన ఆర్బీఐ... ఇపుడు వడ్డీ రేట్లను తగ్గించి మార్కెట్‌ను ఆశ్చర్య పర్చింది. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి భారీ ఎత్తున రుణాలు సేకరిస్తుందని, ఫలితంగా నిధుల కొరత ఏర్పడుతుందని.... వీటి నేపథ్యంలో వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించకపోవచ్చని భావించారు. అయితే మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగ పరిస్థితులను రెండురోజుల పాటు మదింపు వేసిన ఆర్బీఐ ఎంపీసీ ఇవాళ తుది నిర్ణయం తీసుకుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)