ఒకే ఓవర్లో 43 పరుగులు...

ఒకే ఓవర్లో 43 పరుగులు...

న్యూజిలాండ్ దేశావాళీ క్రికెట్ లో అరుదైన రికార్డు నమోదైంది. ఫోర్డ్ ట్రోఫి వన్డే టోర్నిలో భాగంగా సెంట్రల్ డిస్ట్రిక్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో నార్తన్ డిస్ట్రిక్ ఆటగాళ్లు  బ్యాట్స్‌మెన్ బ్రెట్ హాంప్టన్, జో కార్టర్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతోపాటు మొత్తం 43 పరుగులు చేశారు. ఈ ఓవర్లో రెండు నోబాల్స్‌తోపాటు ఓ ఫోర్, ఓ సింగిల్ కూడా ఉన్నాయి. విలెమ్ లుడిక్ అనే బౌలర్ వేసిన ఓవర్లో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ పరుగుల మోత మోగించారు. అప్పటివరకు 9 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి వికెట్ తీసుకున్న లుడిక్.. పదో ఓవర్ ముగిసే సరికి ఏకంగా 85 పరుగులకు చేరడం విశేషం. ఓవర్ ఫస్ట్ బాల్ యార్కర్ వేసినా.. అది వికెట్ల వెనుక ఫోర్ వెళ్లింది. ఆ తర్వాత రెండు ఫుల్ టాసస్ నడుము కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో అంపైర్ నోబాల్స్‌గా ప్రకటించాడు. ఆ రెండు బంతులనూ హాంప్టన్ సిక్సర్లుగా మలిచాడు.