మద్యం షాపులు తెరవాలంటున్న నటుడు...

మద్యం షాపులు తెరవాలంటున్న నటుడు...

కరోనా వైరస్ మహమ్మారిని ప్రజలను కాపాడుకునేందుకు, వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ, పటిష్టంగా అమలు చేస్తున్నాయి. దీంతో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. అయితే, ఈ లాక్‌డౌన్ కారణంగా ఇతరుల కంటే.. మద్యంబాబుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మద్యానికి బానిసలుగా ఉన్నవారు ఇపుడు తాగేందుకు మద్యం లేకి వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీంతో రోజులో రెండు గంటలైనా మందు షాపులు తెరవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి వారికి తన మద్దతుని తెలియజేశారు బాలీవుడ్ సీనియర్ నటుడు  రిషి కపూర్‌. ప్రతిరోజూ సాయంత్రం లిక్కర్ షాపులు తెరవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. 'ప్రభుత్వాలకు ఎక్సైజ్ శాఖ నుండి డబ్బులు అవసరం. అందుకోసం లైసెన్స్ ఉన్న మద్యం దుకాణాలను  సాయంత్ర వేళల్లో తెరిస్తే బావుంటుంది.  లాక్ డౌన్ సమయంలో మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశతో ఉంటాడు. ఇలాంటి సమయంలో మద్యం అవసరం. కాబట్టి బ్లాక్‌లో అయినా మద్యం అమ్మే ఏర్పాటు చేయండి. తప్పుగా అర్థం చేసుకుని నన్ను తిట్టొద్దు.' అంటూ రిషికపూర్ ట్వీట్ చేసారు.