జాతీయ రహదారిపై ట్యాంకర్, ఆర్టీసీ బస్సు ఢీ

జాతీయ రహదారిపై ట్యాంకర్, ఆర్టీసీ బస్సు ఢీ

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద సోమవారం తెల్లవారుజామున ట్యాంకర్ ను వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. క్షతగాత్రులను నార్కట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి బస్సు హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.