రైతులకు అండగా ఉంటాం: మంత్రి పోచారం

రైతులకు అండగా ఉంటాం: మంత్రి పోచారం

జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలో జరిగిన రైతుబంధు జీవిత బీమా కార్యక్రమంలో రైతులకు దృవీకరణ పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి హజరయ్యారు. దృవీకరణ పత్రాలు పంపిణీ చేసిన అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు, అయినా ముఖ్యమంత్రి గారు లోతుగా ఆలోచన చేసి ప్రజలకు మేలు చెసే పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. 

మనసున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 4000 చొప్పున ఇస్తున్నారు. ఈ ఏడాది వానాకాలంలో ఇప్పటి వరకు రూ. 5670 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో 91 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వీరందరూ ఆత్మగౌరవంతో బతకాలి, అప్పుల ఊభి నుండి బయటపడాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన, కొత్తగా భూమి మార్పులు జరిగి పాస్ పుస్తకాలను పొందిన రైతులకు ఈ పథకం వర్తింపచేస్తాం. ఇప్పటికే వెరే రకాలైన బీమా ఉన్న రైతులు కూడా ఈ పథకానికి అర్హులు, అశ్రద్ద చేయకుండా రైతు బీమా పథకంలో పేర్లను నమోదు చేయించుకోవాలని మంత్రి తెలిపారు.