హిట్ దర్శకుడితో ధరమ్ తేజ్ సినిమా !

హిట్ దర్శకుడితో ధరమ్ తేజ్ సినిమా !

వరుసగా ఆరు పరాజయాలతో డీలా పడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన తర్వాతి సినిమాను టీమ్ తీసుకుని ఒక హిట్ దర్శకుడితో సెట్ చేసుకున్నాడు.  ఆ దర్శకుడు మరెవరో కాదు 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్.  ఈ సినిమాతో వంద కోట్ల దర్శకుడిగా మారారు పరశురామ్. 

ఇంతకుమునుపు తేజ్ ను డైరెక్ట్ చేయబోయే దర్శకుల జాబితాలో పలువురి పేర్లు వినబడినా చివరికి పరశురామ్ పేరు ఖాయమైనట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం స్క్రిప్ట్ వరకు దశలో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.