పెళ్లి ఆడవాళ్లకు అడ్డుకాకూడదు - సమంత

 పెళ్లి ఆడవాళ్లకు అడ్డుకాకూడదు - సమంత

పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాలు తగ్గించుకోవడమో లేకుంటే పూర్తిగా మానేయడమో చేస్తుంటారు.  కానీ సమంత మాత్రం నాగ చైతన్యతో వివాహము తరవాత రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లోకి హిస్తూ దూసుకుపోతున్నారు.  వివాహానంతరం ఆమె చేసిన 'రంగస్థలం, ఇరుంబుతిరై, మహానటి' లాంటి సూపర్ హిట్ సినిమాల్ని చేసిన ఆమె ప్రస్తుతం 'యు టర్న్, సీమరాజ, సూపర్ డీలక్స్' లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ఈ సందర్బంగా ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులతో మాట్లాడుతూ పెళ్లి అనేది ఆడవారిని మరింత శక్తివంతంగా తయారుచేయాలి.  అంతేకానీ వాళ్లకు అడ్డుకాకూడదు.  ప్రస్తుతం నేను చాలా బాగా పనిచేస్తున్నాను.  ఎందుకంటే వివాహం తర్వాత నేను మునుపటికంటే ఎక్కువ శక్తివంతురాలినయ్యాను అన్నారు.