28న విడుద‌లవుతున్న శాంసంగ్ గెలాక్సీ ఎం20, ఎం10

28న విడుద‌లవుతున్న శాంసంగ్ గెలాక్సీ ఎం20, ఎం10

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం20, ఎం10లను ఈ నెల 28వ తేదీన భారత్ లో విడుద‌ల చేయ‌నుంది. మార్చి 5 నుండి ఈ ఫోన్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అమెజాన్‌, శాంసంగ్ స్టోర్లలో ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యించ‌నున్నారు. వీటి ధ‌ర వివ‌రాల‌ను కంపెనీ ఇంకా వెల్ల‌డించ‌లేదు. అయితే ఎం10 ధర రూ. 8,990లుగా, ఎం 20 ధర  రూ.12,990లకు లభించనుందని సమాచారం తెలుస్తోంది. ఇంతకుముందు ఎం10 ధర రూ. 7,990లకు, ఎం 20 ధర రూ.10,990లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎం20, ఎం10లలో ప‌లు ఆక‌ట్టుకునే  ఫీచ‌ర్లు ఉన్నాయి.

ఎం20 ఫీచ‌ర్లు:

# 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
# 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
# ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7885 ప్రాసెస‌ర్‌
# 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ (512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌)
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
# 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
# ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
# 5,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఎం10 ఫీచ‌ర్లు:

# 6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
# 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
# ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7872 ప్రాసెస‌ర్‌
# 2/3 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
# 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
# ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
# 3,400 ఎంఏహెచ్ బ్యాట‌రీ