డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధ్యానత... ఈ సీజన్ నుంచే అమలు... 

డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధ్యానత... ఈ సీజన్ నుంచే అమలు... 

నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.  రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన సమయంలో వర్షాలు కురుస్తాయి.  వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఈనెల నుంచి రైతులు కొత్త పంట వేసేందుకు రెడీ అవుతుంటారు.  

అయితే, తెలంగాణలో పంటల విషయంలో కొత్త విధానం తీసుకొచ్చింది.  దేశంలో డిమాండ్ ఉన్న పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  డిమాండ్ ఉన్న పంటలను పండించాలని ఇప్పటికే కేసీఆర్ రైతులకు సూచించారు.  ఏ పంటలకు డిమాండ్ ఉన్నది, ఎంతెంత పంటలు పండించాలి అనే విషయాలను వ్యవసాయక శాఖ రైతులకు తెలియజేస్తుంది.  ఈ వర్షాకాలం నుంచే నియంత్రిత పంటల సాగును అమలు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.  ప్రతి సీజన్ లోనూ నియంత్రిత పంటల సాగు విధానం అమలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  అంతేకాదు రైతులకు సూచనలు చేసేందుకు వ్యవసాయ అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నది.  ఇకపోతే త్వరలోనే రాష్ట్రంలో కాటన్ రీసెర్చ్ అంటే అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు కేసీఆర్ తెలిపారు.