బీసీలపై కేసీఆర్ ది కపట ప్రేమ

బీసీలపై కేసీఆర్ ది కపట ప్రేమ

రిజర్వేషన్లపై కోర్టులో ఇంతగా వాదనలు జరుగుతుంటే.. అడ్వకేట్ జనరల్ హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తే.. బీసీలపై కేసీఆర్ ది కపట ప్రేమే అని అర్థమౌతుందన్నారు మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పంచాయితీ ఎన్నికల్లో యాభైశాతం రిజర్వేషన్లు మించొద్దని కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్ కు సిగ్గు లేదని తెలిపారు. 2013లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్స్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పించిందని వెల్లడించారు.  యాబై శాతం నిబంధనను పక్కన పెట్టి.. 60 శాతానికి పైగా రిజర్వేషన్స్ అమలు చేసామని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు లేకుండా సస్పెండ్ చేసి.. బిల్లు పాస్ చేశారని ఆరోపించారు. మేము సలహాలు ఇస్తామన్నా ఒప్పుకోకుండా.. ఇప్పుడు తప్పు మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ఇంత పెద్ద ఇష్యూపై కోర్టులో వాదనలు జరుగుతుంటే.. ఎందుకు అడ్వకేట్ జనరల్ హాజరు కాలేదు? ఇదేనా బీసీలపై మీ ప్రేమ? బీసీలపై కేసీఆర్ ది కపట ప్రేమ అంటూ ఆయన ప్రశ్నించారు. నేను చెప్పిందే చట్టం అనే వైఖరి కేసీఆర్ ది.. అందుకే కోర్ట్ మొట్టికాయలు వేసింది..ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.