స్థిరంగా ముగిసిన నిఫ్టి
తీవ్ర ఒడుదుడుకుల మధ్య మార్కెట్ స్థిరంగా ముగిసింది. నిఫ్టి క్రితం ముగింపు వద్దే క్లోజైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టి 10,710 గరిష్ఠ స్థాయికి చేరింది. తరవాత 10,623కి పడిపోయినా.. మూడు గంటలకల్లా 10,691వ స్థాయికి చేరి పరవాలేదనిపించింది. కాని కేవలం 15 నిమిషాల్లో ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 10,612కి పడిపోయింది. తరవాత కోలుకున్నట్లు కన్పించినా.. చివరల్లో మళ్ళీ క్షీణించి క్రితం ముగింపు వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ మిశ్రమంగా ఉన్నాయి. క్రూడ్, రూపాయి ధరల్లో పెద్దగా మార్పు లేదు.
ఇవాళ ప్రైవేట్ బ్యాంక్ షేర్లు బాగా రాణించాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 6 శాతంపైగా లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. టాటా అయిదున్నర శాతం పెరగ్గా, యాక్సిస్ బ్యాంక్ నాలుగున్నర శాతం పెరిగింది. హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు మూడు శాతం పెరిగాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అయిదు శాతం క్షీణించి రూ. 665 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫ్రాటెల్ షేర్లు కూడా రెండు శాతంపైగా నష్టంతో ట్రేడయ్యాయి. డిష్ టీవీ 11 శాతం పెరగ్గా, జీ టీవీ షేర్ మాత్రం క్రితం ముగింపు వద్దే ముగిసింది. దీవాన్ హౌసింగ్ ఇవాళ మరో అయిదున్నర శాతం క్షీణించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)