శేఖర్ కమ్ముల నెక్స్ట్ ప్రాజెక్ట్..ఆ హీరోతోనే

శేఖర్ కమ్ముల నెక్స్ట్ ప్రాజెక్ట్..ఆ హీరోతోనే

'డాలర్ డ్రీమ్స్' చిత్రంతో  దర్శకుడిగా పరిచయమైనా.. 'ఆనంద్' చిత్రమే శేఖర్ కమ్ములను ఆడియెన్స్‌కు దగ్గర చేసింది. ఇక.. 'హ్యాపీడేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' వంటి విజయాలను అందుకున్న ఈ ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్‌కు ఆ తర్వాత 'లీడర్', 'అనామిక' చిత్రాలు ఆశించిన విజయాల్ని అందించలేదు. గత ఏడాది విడుదలైన 'ఫిదా' చిత్రంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు శేఖర్.
 మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌తేజ్‌కు 'ఫిదా' వంటి హిట్ ఇచ్చిన శేఖర్.. ఈ సినిమాతో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవిని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ప్రస్తుతం నాగచైతన్య , సాయి పల్లవిలతో లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం 'లవ్ స్టోరీ' మూవీ తర్వాత శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ మూవీ కూడా ఏషియన్ వారికే చేయనున్నాడట. ఈ సినిమాలో ఓ పెద్ద హీరో నటించబోతున్నాడని.. ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయని సమాచారం. కాగా స్టార్ హీరో గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది సోషల్ మీడియా కథనాల ప్రకారం ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను అప్రోచ్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట ఈ సీనియర్ డైరెక్టర్. అప్పుడప్పుడు ప్రయోగాలకు పెద్ద పీట వేసే బన్నీకి తన స్టోరీని వినిపించేందుకు సిద్ధమయ్యాడట.చూడాలి మరి ఈ వార్తల్లో నిజమెంతుందో...