సిర్పూర్‌ మిల్లులో మళ్లీ ఉత్పత్తి ప్రారంభం..

సిర్పూర్‌ మిల్లులో మళ్లీ ఉత్పత్తి ప్రారంభం..

మూతపడిపోయింది... మళ్లీ తెరుచుకోవడం కష్టమేనన్న వాదనలు వినిపించిన సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మిల్లు(ఎస్పీఎం)లో తిరిగి ఉత్పత్తి ప్రారంభమైంది. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్పీఎం వైస్‌ ప్రెసిడెంట్‌ పవన్‌కుమార్‌ సూరి, ఎస్పీఎం ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి మిల్లులోని ఏడో కాగితం ఉత్పత్తి చేసే యంత్రాన్ని స్విచ్‌ ఆన్ చేసి ఉత్పత్తి ప్రారంభించారు. తెలంగాణ సర్కార్ చొరవతో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మిల్లులో మళ్లీ ఉత్పత్తి ప్రారంభమైంది. కాగా, 1932లో కుమురం భీం జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో స్థాపించిన మిల్లు నాలుగేళ్ల క్రితం మిల్లు యాజమాన్య వైఖరి, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో మూతపడింది. అయితే, తిరిగి ఉత్పత్తి ప్రారంభం కావడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.