నేటి నుంచే  రైల్వే రిజర్వేషన్ బుకింగ్: అత్యధికంగా ఏపీ నుంచే...!!

నేటి నుంచే  రైల్వే రిజర్వేషన్ బుకింగ్: అత్యధికంగా ఏపీ నుంచే...!!

ఈరోజు నుంచి దేశంలో రైల్వే రిజర్వేషన్ కోసం బుకింగ్ కౌంటర్స్ ను ఓపెన్ చేస్తున్నారు.  జూన్ 1 నుంచి విమానాలు పరుగులు తీయబోతున్నాయి.  ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ప్రయాణాలు ఉంటాయి.  జూన్ 1 నుంచి కేవలం 200 రైళ్లు మాత్రమే నడవబోతున్నాయి.  అవి నాన్ ఏసీ రైళ్లు మాత్రమే నడవబోతున్నాయి. దీనికి సంబంధించిన రిజర్వేషన్ టికెట్స్ ఈరోజు నుంచి టికెట్స్ కౌంటర్లు లో ఇస్తున్నారు.  

అయితే, గతంలో మాదిరిగా అన్ని రైల్వే స్టేషన్స్ లో టికెట్స్ కౌంటర్లు అందుబాటులో లేవు.  ప్రభుత్వం నిర్ణయించిన కౌంటర్లలో మాత్రమే టికెట్స్ అందుబాటులో ఉంటాయి.  తెలంగాణలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో మొత్తం 73 రైల్వే స్టేషన్లలో టిక్కెట్లు అందుబాటులో ఉంచారు.  దీని ప్రకారం తెలంగాణలో 19, ఏపీలో 43, మహారాష్ట్రలో 6, కర్ణాటకలో 5 స్టేషన్లలో టికెట్స్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.  

తెలంగాణ విషయానికి వస్తే : సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్, తాండూర్, కాజిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపేట్, కర్నూల్, మహబూబ్‌నగర్ స్టేషనల్లో టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.  అలానే ఆంధ్రప్రదేశ్ లో  విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట, పిడుగురాళ్ల, నంబూరు, మంగళగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, కృష్ణా కెనాల్, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామల్‌కోట, తాడేపల్లిగూడెం, అనపర్తి, పిఠాపురం, అన్నవరం, తుని, నారిపట్నం రోడ్, యలమంచిలి, అనకాపల్లి, రాయనపాడు, కొండపల్లి, చిత్తూరు, కోడూరు, ఒబులవారిపల్లె, పుల్లంపేట్, రాజంపేట్, నందలూరు, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, అధోని, మంత్రాలయం రోడ్, అనంతపూర్, ధర్మవరం స్టేషన్లలో టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది.