కరోనా ఎఫెక్ట్ : శ్రీలంకలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం రద్దు...

కరోనా ఎఫెక్ట్ : శ్రీలంకలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం రద్దు...

శ్రీలంక ప్రధానమంత్రి ఈ రోజు 40 మిలియన్ డాలర్లతో నిర్మించాలనుకున్న క్రికెట్ స్టేడియం ప్రాజెక్ట్ ను రద్దు చేశారు. అయితే హోమగామాలో దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిని 60,000 సామర్థ్యంతో 26 ఏకరాలలో నిర్మించాలని అనుకుంది. కానీ మాజీ కెప్టెన్లు సనత్ జయసూర్య, మహేలా జయవర్ధనే ఈ స్టేడియం ఎందుకు అని శ్రీలంక క్రికెట్ ను ప్రశ్నించారు. మన వద్ద ఉన్న స్టేడియాలలో తగినంత అంతర్జాతీయ క్రికెట్ లేదా దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా ఆడటం లేదు ... అలాగే ఇప్పటికే కరోనా కారణంగా శ్రీలంక క్రికెట్ చాల నష్టపోయింది. ఈ సమయం లో మనకు మరొకటి అవసరమా? జయవర్ధనే అడిగారు. దానికి జయసూర్య మద్దతుగా నిలిచారు. అయితే ఈ రోజు మాజీ అగ్రశ్రేణి ఆటగాళ్ళతో జరిగిన సమావేశంలో ఈ స్టేడియానికి బదులుగా పాఠశాలు అలాగే మిగితా పాత క్రికెట్ స్టేడియాలను పునరుద్ధరించడానికి ఆ డబ్బు ఖర్చు చేయడం మంచిదని నిర్ణయించారు" అని పిఎం మహీంద రాజపక్సే తెలిపాడు. అయితే 2005 మరియు 2010 మధ్యకాలంలో రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్న సమయం లో, అతను తన సొంత నియోజకవర్గం లో 35,000 సామర్థ్యం గల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించాడు. అయితే ఇప్పటివరకు శ్రీలంకలో అదే అతి పెద్ద క్రికెట్ స్టేడియం.