మోడీ మీకిది తగునా.. ?
ఆంధ్ర ప్రజలపై కేంద్ర ప్రభుత్వం సవితి ప్రేమ చూపుతుందని లోక్ సభలో శ్రీకాకుళం టీడీపీ ఎంపి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. కేంద్ర నిధుల కేటాయింపుల విషయంలో మోడీ ప్రభుత్వం కావాలనే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని తన ప్రసంగంలో టీడీపీ ఎంపీ విమర్శించారు. గుజరాత్లో పటేల్ విగ్రహానికి వేలకోట్లు కుమ్మరించిన మోడీ సర్కార్, అమరావతి నిర్మాణం కోసం రూ. 1500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు సభలో మోడీ దిగజారి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసిన రామ్మోహన్ నాయుడు, తమ నేత చంద్రబాబు ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, రైల్వే జోన్ ని తుంగలో తొక్కందని మండిపడ్డారు. వెనకబడిన జిల్లాల కోసమని 350 కోట్లు అకౌంట్ లో వేసి, రాజకీయ కక్షతోనే ఆ నిధులను వెనక్కి తీసుకుందని శ్రీకాకుళం ఎంపి పేర్కొన్నారు. ఇంతటి దారుణం ఎన్నడూ జరగలేదని రామ్మోహన్ నాయుడు వాపోయారు. కేంద్రం సహకరించకపోయినా ఏపి అద్భుత పురోగతి సాధిస్తుందని తెగేసి చెప్పారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)