సూర్య సినిమాల్లో చెప్పినట్టే జరుగుతుందే...!!

సూర్య సినిమాల్లో చెప్పినట్టే జరుగుతుందే...!!

కరోనా వైరస్ ఎవ్వరు ఉంచని విధంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. వేళా సంఖ్యలో ప్రజల ప్రాణాలు హరిస్తున్న ఈ మహమ్మారి  చిన్న పెద్ద తేడాలేకుండా దేశాలన్నిటిని చిగురుటాకులా వణికిస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మహమ్మారి తన పంజా విసురుతుంది. మన దగ్గర పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  కంటికి కనిపించని  శత్రువుతో ప్రపంచమంతా యుద్ధం చేస్తుంది. కాగా సోషల్ మీడియాలో ఈ వైరస్ కు సంబందించిన వీడియోలో, ట్రోల్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి వాటిలో హీరో సూర్య కు సంబందించిన వార్త ఒకటి.  

హీరో సూర్య , మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సెవంత్ సెన్స్ . ఈ సినిమాలో కూడా ఒక వైరాస్ భారత దేశాన్ని  గడగడలాడిస్తుంది అని చూపించారు. చైనా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆ వైరస్ ఒక కుక్క ద్వారా ప్రజలందరికి వ్యాపింప చేస్తాడు. దానికి హీరో విరుగుడు కనిపెడతాడు. ఇప్పుడు కరోనా వైరస్ కూడా అలానే ప్రబలుతోంది. అంతే కాకుండా భారత్ కు పొంచి ఉన్న మరో ముప్పు మిడతల దండు. పాకిస్థాన్ దేశం నుంచి మిడతల దండు  భారత్ పై దాడి చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తూ రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. భారత్ ను దెబ్బ తీసేందుకు పాక్ ఈ మిడతల దండును మన పై వదిలిందని కొందరు అంటున్నారు. పైగా సూర్య నటించిన "కప్పాన్"  తెలుగులో బందోబస్త్ సినిమాలో కూడా మిడత దండు గురించి చూపించారు. అవి ఎలా పంటలపై దాడి చేస్తాయి . వాటివల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనేది సినిమాలో చూపించారు. ఇలా  సూర్య నటించిన రెండు సినిమాల్లో రెండు వివత్తుల గురించి చూపించడం తో సోషల్ మీడియాలో సూర్య సినిమాలు సంబందించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. సూర్య కు ముందే తెలుసా.. ఇలా జరుగుతుందని.? అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు.