ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తామని అప్పుడే చెప్పారు..

ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తామని అప్పుడే చెప్పారు..

కర్నూలు ఎమ్మెల్యేగా తనకు టికెట్ ఇచ్చే విషయం.. టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే సమయంలోనే ఖరారైందని టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు. లోకేష్‌ ఏ హోదాతో అభ్యర్థులను ప్రకటించారంటూ టీజీ వెంకటేష్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎస్వీ మాట్లాడుతూ లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి హోదాలో ప్రకటించారని చెప్పారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలని లేదని చెప్పిన ఎస్వీ.. టీజీ వెంకటేష్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశారు.