బీసీల వ్యతిరేకి కేసీఆర్ 

బీసీల వ్యతిరేకి కేసీఆర్ 

జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే... కేసీఆర్ మాత్రం బీసీ వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నారని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను  కోర్టు తప్పుపడితే.. దానికి కాంగ్రెస్ పార్టీని ఎలా బాధ్యులను చేస్తారు.? అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి బీసీ బిల్లును పాస్ చేసుకొని ఆ నెపం మా మీదకు నెడతారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అబద్ధాలు చెప్తూ... బోగస్ మాటలు మాట్లాడుతూ... బీసీ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ఎందుకు కేసీఆర్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.