ఓటరు కార్డు లేదా.... ఇవి ఉంటే చాలు

ఓటరు కార్డు లేదా.... ఇవి ఉంటే చాలు

శుక్రవారం ఉదయం 6 గంటలకు తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మరియు పాత వారిలో చాలా మందికి ఓటరు గుర్తింపు కార్డులు లేవు. అయితే ఓటు వేయడానికి తమను అనుమతిస్తారో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఓటరు కార్డు లేకపోయినా.. ప్రభుత్వం గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.

13 కార్డులు ఇవే:

1. పాస్ పోర్ట్
2. డ్రైవింగ్ లైసెన్స్
3. ఆధార్ కార్డు
4. పాన్ కార్డు
5. ఆరోగ్య బీమా కార్డు
6. ఉపాధి హామీ పథకం కార్డు
7. బ్యాంకు పాసు పుస్తకం
8. పోస్టాఫీస్ పాసు పుస్తకం
9. ప్రభుత్వ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు ఐడి కార్డు
10. ఆర్జీఐ జారీ చేసిన ఎన్ పీఆర్ స్మార్ట్ కార్డు
11. ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్
12. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గుర్తింపు కార్డు
13. ఈసీ జారీ చేసిన ఫోటోతో కూడిన ఓటరు స్లిప్