మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించేశారే...

మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించేశారే...

మన దగ్గర ఎన్ని బ్రాండ్లు దొరికినా... విదేశీ మద్యం ఇచ్చే కిక్కే వేరు... లోకల్‌గా దొరికే అన్ని బ్రాండ్లను తాగి చూసినా... ఓ సారి ఫారిన్ మందు రుచిచూడాలన్నదే మద్యం ప్రియుల మనసులోని మాట... అందుకే విదేశీ మద్యం అనగానే జేబుకు చిల్లుపడినా సరే బ్లాక్‌ మార్కెట్‌లో కొని తాగేస్తుంటారు. అయితే ఒకేసారి వందలాది విదేశీ మద్యం బాటిళ్లను అలా రోడ్డుపై పేర్చి... రోడ్డు రోలర్‌తో తొక్కిస్తుంటే... ఆ విదేశీ మద్యం రోడ్డుపై ఏరులై పారుతుంటే... అది చూసిన మద్యం ప్రియుల మనస్సు ఎంత ఆవేదన చెందుతుందో చెప్పడం కష్టమే... అలాంటి ఘటనే రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. విదేశాలనుంచి అక్రమంగా తీసుకొచ్చి అమ్ముతున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న రాజేంద్రనగర్‌ ఎక్సైజ్ పోలీసులు... స్మగర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 40 లక్షల విలువైన వివిధ బ్రాండ్ లకు చెందిన 640 విదేశీ మద్యం బాటిళ్లను రోడ్డుపై వరుసగా పేర్చి రోడ్డు రోలర్ తో తొక్కించారు. తొక్కించిన మద్యం బాటిళ్లలో… బ్లాక్ లేబుల్, గోల్డ్, రెడ్ లేబుల్, గ్లన్ ఫిడిచ్, గ్లన్ లివెట్, అబ్సల్ట్ వోడ్కా తో పాటుగా మరికొన్ని ఖరీదైన బ్రాండ్ లు ఉన్నాయి. కాగా, విదేశాల నుంచి తెచ్చిన మద్యం బాటిళ్లను సిటీలో భారీ రేట్లకు అమ్ముతున్నారన్న సమాచారంతో నిఘా పెట్టి ఈ బాటిళ్లను స్వాధీనం చేసుకుంది ఎక్సైజ్ శాఖ. చివరకు రోడ్డు పెట్టి... రోడ్డురోలర్‌తో తొక్కించి ధ్వంసం చేసింది.