లాక్ డౌన్ ను అతిక్రమిస్తే... క్రిమినల్ కేసులు..

లాక్ డౌన్ ను అతిక్రమిస్తే... క్రిమినల్ కేసులు..

దేశంలో లాక్ డౌన్ ప్రశాంతంగా జరుగుతున్నది.  మొదట్లో లాక్ డౌన్ విధించినా జనాలు రోడ్లపైకి వస్తుండేవారు.  పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో పాటుగా కేసులు కూడా పెడుతుండటంతో ప్రజలు సూచించిన సమయాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు.  ఇక సాయంత్రం ఏడు గంటల నుంచి రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం సమయంలోనూ రోడ్లు నిర్మానుష్యంగా ఉంటున్నాయి.  అయితే, కొన్ని చోట్ల మాత్రం ఈ వాతావరణం కనిపించడం లేదు.  విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఇంట్లో ఉంటామని హామీ ఇచ్చి ఇంటికి వెళ్ళిన తరువాత తిరిగి బయటకు వస్తున్నారు.  అలా బయటకు వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు.  

విదేశాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్న వారి నుంచి 800 పాస్‌పోర్టులు సీజ్‌  చేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ తెలిపారు.  లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడుతున్నట్టుగా పోలీస్ కమిషనర్ తెలిపారు.  హోంక్వారంటైన్‌ నిబంధనను ఉల్లంఘించినందుకు భువనగిరిలో ఇద్దరు, కుషాయిగూడలో మరో ఇద్దరిపై కేసు పెట్టినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు.