కరోనా వైరస్‌పై తెలుగు సినిమా..దర్శకుడు ఎవరంటే..?

కరోనా వైరస్‌పై తెలుగు సినిమా..దర్శకుడు ఎవరంటే..?

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన మొదటి చిత్రంగా ‘అ’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరక్కించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఆ సినిమాకు జాతీయ అవార్డ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ అతనికి మంచి పేరే తెచ్చిపెట్టింది.మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర్ తో 'కల్కి' అనే సినిమాని తెరకెక్కించి నిరాశపరిచాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత్ వర్మ చాలామంది హీరోలకు స్టోరీలు చెబుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు రావడం జరిగింది. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ భయానక వైరస్ ప్రజలను ఇబ్బంది పెడితే… ఎలాంటి పరిస్థితులు ఎదురుతాయనే అంశంపై ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడట. గతేడాది నవంబర్‌లోనే చిత్ర షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సగం షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిందని సమాచారం.ఇండస్ట్రీలో కొత్త వారు మరియు పాత వారి కలయికలో ఈ సినిమాని తెరకెక్కించ్చారని సమాచారం.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.