విజయ్ సర్కార్ లో అదే పెద్ద ట్విస్ట్..!!
విజయ్.. మురుగదాస్ కంబినేషన్లో సర్కార్ రాబోతున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే వివాదాస్పదంగా మారింది. విజయ్ సిగార్ తాగుతున్నట్టుగా ఉన్న ఫోటోపై కొంతమంది నిరసనలు తెలియజేశారు. మరికొందరు మాత్రం విజయ్ కు బాసటగా నిలిచారు. మద్రాస్ హైకోర్ట్ జోక్యంగా విజయ్ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను తొలగించాడు.
కాగా, ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఫోటో ట్రెండ్ అవుతోంది. విజయ్ లావిష్ సూట్ తో లగ్జరీ కారులో కూర్చొని లాప్ చూస్తుంటాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించే విజయ్ కొన్ని కారణాల వలన ఇండియాకు తిరిగి వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వస్తుంది. రూలింగ్ పార్టీ తరపున రాజకీయాల్లోకి వస్తాడా లేదంటే.. అపోజిషన్ పార్టీ తరపున రాజకీయాల్లోకి దిగుతాడా అన్నది సస్పెన్స్. ఇటీవలే తెలుగులో వచ్చిన మహేష్ బాబు భరత్ అనే నేను కూడా ఇంచుమించు అలాంటి కథతోనే వచ్చింది. మరి మురుగదాస్ సర్కార్ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)