కేసీఆర్‌తో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ.. ఈ అంశాల పైనే కీలక చర్చ...!

కేసీఆర్‌తో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ.. ఈ అంశాల పైనే కీలక చర్చ...!

తెలంగాణ సీఎం KCRతో భేటీ కాబోతున్నారు తెలుగు సినీ ప్రముఖులు. లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి సినిమా షూటింగ్‌లు చేసుకోవడం, థియేటర్లు తెరవడం వంటి అంశాలపై... ఆయనతో చర్చించబోతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల పై నిన్న మంత్రి తలసానితో భేటీ అయిన సినీ ప్రముఖులు ఇదే విషయాల పై సీఎం కేసీఆర్ తో చర్చించనున్నారు.

సినీప్రముఖులు సీఎం ముందుంచే ప్రతిపాదనల్లో ముఖ్యమైనవి థియోటర్లలో సోషల్ డిస్టెన్స్ పొగా ఫిల్ అయ్యే సీట్లకు వరకే ట్యాక్స్ కట్టేలా,అలాగే షూటింగ్ లకు ఇతర రాష్ట్రాల్లో అనుమతులు లేనందున ఇక్కడ ఉన్న లోకేషన్లలో షూటింగ్ చేసుకునెందుకు కొంత రాయితీ ఇవ్వాలన్న ప్రతిపాదనలను సీఎం ముందుంచనున్నారు.రిలీజ్ కాబోయో సినిమాలకు కొన్ని పన్ను రాయితీలను కోరనున్నారు.ఇక షూటింగ్ లు మొదలు పెడితే పరిమిత సంఖ్యలో 50 మందితో ఇన్ డోర్,ఔట్ డోర్ షూటింగ్ ఎలా చేస్తామన్నది ప్రజెంటేషన్ రూపంలో సీఎం కి సమర్పించనున్నారు.సీఎంతోభేటీ అయ్యేందుకు ప్రగతిభవన్ కి చేరుకున్నవారిలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్‌, N.శంకర్‌, అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, రాధాకృష్ణ, C.కల్యాణ్, సురేష్‌బాబు, కొరటాల శివ... KCRను కలిసే బృందంలో ఉన్నారు.