టోల్‌ రద్దు చేసినా.. వసూలు

టోల్‌ రద్దు చేసినా.. వసూలు

సంక్రాంతి పండగ సందర్భంగా జాతీయ రాహదారులపై టోల్‌గేట్ల వసూళ్లను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినా టోల్‌గేట్‌ సిబ్బంది టోల్‌ వసూలు చేస్తున్నారు. సంక్రాతి పండుగ వేళ విపరీతమైన రద్దీ కారణంగా టోల్‌గేట్ల వద్ద ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందిపడకూడని 13, 16 తేదీల్లో జాతీయ రహదారులపై టోల్‌గేట్ల వద్ద టోల్‌ వసూళ్లను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఆదేశాలను టోల్‌ సిబ్బంది పాటించడం లేదు. పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు టోల్‌గేట్ల వద్ద టోల్‌ వసూలు చేస్తున్నారు. ప్రయాణికులు ప్రశ్నించగా తమకు రద్దు ఆదేశాలు రాలేదని చెపుతున్నారు. దీంతో ప్రయాణికులు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు.