టీటీడీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ పేరు మార్పు...!

టీటీడీ ఆన్‌లైన్ వెబ్‌సైట్ పేరు మార్పు...!

తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ సేవ‌ల వెబ్‌సైట్ పేరును మార్చారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ప్రకటన జారీ చేసింది. స్వతంత్రంగా ఉన్న టీటీడీ వెబ్ సైట్‌ను ప్రభుత్వ  సైట్‌కు అనుబందంగా మారుస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఈ మధ్యకాలంలో టీటీడీ పేరుతో పలు ఫేక్ సైట్లు హల్ చల్ చేయడంతో ఈ మేరకు కొన్ని మార్పులు చేసింది టీటీడీ.

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆర్జిత‌సేవలు, ద‌ర్శ‌నం, బ‌స, క‌ల్యాణ‌మండ‌పాలు త‌దిత‌ర ఆన్‌లైన్ సేవ‌లను బుక్ చేసుకోవ‌డంతోపాటు https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా పేరు మార్చనున్నట్టు టీటీడీ ప్రకటించింది. మార్చిన పేరు గల వెబ్‌సైట్ రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఈ-హుండీ, ఈ-డొనేష‌న్స్ సౌక‌ర్యం కూడా ఈ వెబ్ సైట్ ద్వారానే అందుబాటులో ఉండనుంది.