ఇది మన ప్రాజెక్ట్, నిధులిస్తున్నారని చాటిచెప్పాలి...

ఇది మన ప్రాజెక్ట్, నిధులిస్తున్నారని చాటిచెప్పాలి...

పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని... ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నిధులు ఇస్తున్నారని చాటి చెప్పాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ... పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పరిశీలించిన ఆయన... అనంతరం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... మోడీ సర్కారు ఇరిగేషన్ కు అధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. గోదావరి మిగులు జలాలు తమిళనాడు, కర్ణాటకకు కూడా తీసుకు వెళ్లామని గుర్తుచేసిన ఆయన... రాజకీయం వేరు, అభివృద్ధి వేరని తెలిపారు. ఇక పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరించడంలేదన్న ఆరోపణలపై ఘాటుగా స్పందించిన గడ్కరీ... కొందరు కేంద్రం వల్లే ప్రాజెక్ట్ పనులు జరగడం లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పునరావాసంలో గిరిజనులకు అన్యాయం జరగనివ్వమని వెల్లడించిన కేంద్రమంత్రి... ఇది మన ప్రాజెక్ట్, కేంద్రం నిధులతో నడుస్తున్న ప్రాజెక్ట్ అని ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు.