యోగి సర్కార్ సంచలన నిర్ణయం...6నెలల పాటు ఎస్మా ప్రయోగం.!

యోగి సర్కార్ సంచలన నిర్ణయం...6నెలల పాటు ఎస్మా ప్రయోగం.!

యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలపాటు రాష్ట్రంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగిస్తున్నట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనుమతి మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముకుల్ సింఘాల్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో ఈ ఆదేశాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎస్మా చట్టం అమల్లో ఉండగా రైల్వే, టెలిగ్రాఫ్ , పోస్టల్ కార్యకలాపాలు సహా అత్యవసర సేవల విభాగాలకు చెందిన ఉద్యోగులెవరూ సమ్మె చేసేందుకు వీల్లేకుండా నిషేధం కొనసాగుతుంది. ఎస్మా చట్టం  ఉల్లంఘిస్తే నిందితులకు ఏడాది పాటు జైలుశిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండు శిక్షలు ఒకేసారి విధించే అవకాశముంటుంది. అయితే ఈ చట్టం ప్రకారం అరెస్ట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం ఉందట.