సంక్షోభం సమయంలో నా వంతు సాయం చేస్తున్నా...

సంక్షోభం సమయంలో నా వంతు సాయం చేస్తున్నా...

కరోనా దెబ్బకు దేశం విలవిలాడుతోంది . సినీ ఇండస్ట్రీలోనూ చిన్న చిన్న కార్మికులు పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారి కుటుంబాలు గడవడం కూడా కష్టంగా మారిపోయింది.ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుడగు వేశారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో 'కరోనా క్రైసస్ ఛారిటీని ప్రారంభించారు.ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా యంగ్ హీరో వరుణ్ తేజ్ రూ.20లక్షల విరాళాన్ని సిసిసి కి ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు. సంక్షోభం సమయంలో నా వంతు సాయం చేస్తున్నాను. దయచేసి మీరు కూడా చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి మీ వంతు కృషి చేయండి అని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.