వెంకిమామ మొదలైంది..!

వెంకిమామ మొదలైంది..!

తెలుగులో బయోపిక్, మల్టీస్టారర్ సినిమాల సందడి మొదలైంది.  వెంకటేష్, నాగార్జునలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.  వెంకటేష్.. వరుణ్ తేజ్ సినిమా ఇటీవలే ప్రారంభంకాగా, వెంకటేష్.. నాగచైతన్యల వెంకి మామ సినిమా ఈరోజు రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది.  

సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన బాబి ఈ సినిమాకు దర్శకుడు.  సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది.