మహేష్ బాటలో విజయ్ దేవరకొండ 

మహేష్ బాటలో విజయ్ దేవరకొండ 

యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో నోటా ఒకటి. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో ఉండనుంది. ద్విభాషా చిత్రంగా ఈ నోటా రూపొందుతోంది. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విశేషమేంటంటే విజయ్ దేవరకొండ సీఎం పాత్రలో కనిపించనున్నాడట. 

మొన్ననే సూపర్ స్టార్ మహేష్ బాబు, భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో విజయ్ కనిపించనున్నాడనే వార్త బయటికి రావడంతో మంచి హైప్ నెలకొంది. ఈ సినిమాలో విజయ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టారు. తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ పొలిటికల్ సినిమాను నిర్మిస్తోంది. మరోవైపు విజయ్ ఇదే కాకుండా డియర్ కామ్రేడ్ లో నటించనుండగా, టాక్సీ వాలా, గీత గోవిందం సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.