విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న దేవరకొండ సినిమా !

విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న దేవరకొండ సినిమా !

'గీత గోవిందం' సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన విజయ్ దేవరకొండ 'నోటా' సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు.  ముందుగా చెప్పినట్టే 'టాక్సీవాలా' కంటే ముందే చిత్రం విడుదలవుతోంది.  అక్టోబర్ 4న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. 

విజయ్ గత విజయాల దృష్ట్యా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ రూపొందుతున్న ఈ సినిమాను ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేయగా జ్ఞానవేల్ రాజా నిర్మించారు.  ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో మెహ్రీన్ ప్రిజాద కథానాయకిగా నటిస్తోంది.