ఈ బికినీ భామను గుర్తుపట్టారా..?

ఈ బికినీ భామను గుర్తుపట్టారా..?

ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికి కొంతమంది అట్టే గుర్తుండిపోతారు.  కొంతమంది వారి పెర్ఫార్మన్స్ తోనో, అందంతోను ఆకట్టుకుంటారు.  అలాంటి హీరోయిన్లలో విమలా రామన్ ఒకరు.  విమలా రామన్ తెలుగులో చేసిన సినిమాలు పదిలోపే ఉంటాయి.  ఈ పది సినిమాల్లో గుర్తుపెట్టుకుని సినిమా ఒకటి రెండు ఉన్నాయి.  టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిపోవడంతో టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు షిఫ్ట్ అయింది.  అక్కడ కూడా అవకాశాలు పెద్దగా లేవు.  దీంతో ఈ అమ్మడు కొంతకాలంగా సినిమాల్లో కనిపించడం లేదు.  

ఉన్నట్టుండి సడెన్ గా ఈ అమ్మడు మాల్దీవుల్లో ప్రత్యక్షం అయ్యింది.  తన ప్రియుడు వినయ్ రాయ్ తో కలిసి మాల్దీవుల్లో న్యూఇయర్ సెలబ్రేషన్ చేసుకుంది.  ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  రోజ్ కలర్ బికినీలో పక్కనే చెలికాడుతో కూర్చొని దిగిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.