రోనాల్డో 1వ స్థానం, కోహ్లీ 6వ స్థానం...

రోనాల్డో 1వ స్థానం, కోహ్లీ 6వ స్థానం...

లాక్ డౌన్ సమయంలో స్పాన్సర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారా అత్యధిక ఆదాయాలు సాధించిన అథ్లెట్ల జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ సూపర్ స్టార్ ఆరవ స్థానంలో ఉన్నాడు, మార్చి 12 మరియు మే 14 మధ్య కాలంలో సేకరించబడిన జాబితా ప్రకారం, కోహ్లీ తన పోస్టుల ద్వారా మొత్తం 379,294 పౌండ్లను సంపాదించాడు, ప్రతి పోస్టుకు 126,431 పౌండ్ల చొప్పున సంపాదించాడు. 1.8 మిలియన్ పౌండ్ల ఆదాయంతో పోర్చుగీస్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో ​​రోనాల్డో అగ్రస్థానంలో ఉండగా, అర్జెంటీనా మరియు ఎఫ్‌సి బార్సిలోనా స్టార్ లియోనెల్ మెస్సీ మరియు పిఎస్‌జి యొక్క నేమార్ వరుసగా 1.2 మిలియన్ మరియు 1.1 మిలియన్ల ఆదాయంతో రెండవ మరియు మూడవ స్థానంలో ఉన్నారు. బాస్కెట్‌బాల్ ఆటగాడు షాకిల్ ఓ నీల్ మరియు (583,628 పౌండ్లు) మాజీ ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ కెప్టెన్ డేవిడ్ బెక్హాం (405,359 పౌండ్లు) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక స్వీడన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జ్లతాన్ ఇబ్రహీమోవిక్ (184,413 పౌండ్లు), మాజీ ఎన్‌బిఎ స్టార్ డ్వేన్ వాడే (143,146), బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డాని అల్వెస్ (133,694), బాక్సర్ ఆంథోనీ జాషువా (121,500) ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ కాలంలో అత్యధికంగా సంపాదించిన అథ్లెట్ల టాప్ -10 జాబితాలో స్థానం దక్కించుకున్నారు.