పందెం కోడి 2 రిలీజ్ డేట్ ఫిక్స్ 

పందెం కోడి 2 రిలీజ్ డేట్ ఫిక్స్ 

తమిళ హీరో విశాల్ కు తెలుగునాట మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాకు రెగ్యులర్ హీరో తరహాలో థియేటర్లు ఫుల్ అవుతుంటాయి. ఈ హీరో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన చిత్రమంటే గుర్తొచ్చే పేరు పందెం కోడి. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా పందెం కోడి 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. 

ఈ సీక్వెల్ కి కూడా లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ ఆఖరి దశల్లో ఉన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. విశాల్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి అప్రూవల్ ను TFPC నుండి విశాల్ తీసుకున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తుండగా, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీఫై నిర్మితమవుతోంది ఈ పందెం కోడి 2.