తన బర్త్ డే సందర్భంగా 5 లక్షలు విరాళం ఇచ్చిన హీరో

తన బర్త్ డే సందర్భంగా 5 లక్షలు విరాళం ఇచ్చిన హీరో

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుం చి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలి సిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగా న్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక మంది తమ వంతు సహాయం ప్రకటిస్తున్నారు. తాజాగా యువ హీరో విశ్వక్ సేన్  ఈ రోజు తన బర్త్ డే సందర్భంగా ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ కోవిడ్ 19 వలన ఇబ్బందులు పడుతున్న కళాకారులకి అండగా నిలిచేందుకు తన వంతు భాద్యతగా రూ.5లక్షల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. సినీ కార్మికులకి మనమందరం అండగా నిలబడదాం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు విశ్వక్. పరిస్థితులు చక్కబడే అని మళ్ళీ ప్రపంచం మునుపటిలాగా ఇంకా మంచిగా మారాలని. ప్రజలందరూ ఎవరి పనుల్లో వారు సంతోషంగా ఉండాలని.. భగవంతుని ప్రార్థించడంతో పాటు మన వంతు కర్తవ్యంగా కరోనా వైరస్ పై ప్రత్యక్షంగా పోరాటం చేసే వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు సిబ్బంది మరియు ఎంతోమంది నిజమైన హీరోలకు వారి బాధ్యత నిర్వర్తించే విధంగా మనం సహకారం అందించాలని విశ్వక్ సేన్ కోరారు