బీజేపీ రథయాత్రకు అనుమతి

బీజేపీ రథయాత్రకు అనుమతి

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రథ నిర్వహించేందుకు కోల్‌కతా హైకోర్టు అంగీకరించింది. పార్టీ నేత అమిత్‌ షా నేతృత్వంలో సేవ్‌  డెమొక్రసీ పేరుతో బెంగాల్‌లో బీజేపీ రథ యాత్ర నిర్వహించదలిచింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో బీజేపీ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ తరువాత రథయాత్ర నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు రథయాత్ర నిర్వహించాలని ఆదేశించింది. ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి యాత్ర ప్రారంభవడానికి కనీసం 12 గంటలు ముందుగా ఆ జిల్లా ఎస్సీకి సమాచారం అందించాలని కోర్టు ఆదేశించింది. యాత్రవల్ల మతకల్లోలాలు జరుగుతాయన్న ప్రభుత్వం వాదనను కోర్టు తోసి పుచ్చింది. రతయాత్ర సజావుగా సాగేందుకు రాష్ట్ర పోలీస్‌ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీనిపై డివిజన్‌ బెంచ్‌కు అప్పీలుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.