నర్సింగ్ ఒలంపిక్స్ లోకి వస్తే స్వాగతం పలుకుతాం : డబ్ల్యూఎఫ్ఐ

నర్సింగ్ ఒలంపిక్స్ లోకి వస్తే స్వాగతం పలుకుతాం : డబ్ల్యూఎఫ్ఐ

ఈ సంవత్సరం జరగాల్సిన ఒలంపిక్స్ వాయిదా వల్ల అందరూ అథ్లెట్లు నిరాశకు గురయ్యారు. అయితే ఈ వాయిదా వలన మాత్రం ఒకరికి మంచే జరిగిందని చెప్పాలి అతనే రెస్లర్ నర్సింగ్ యాదవ్‌. ఈ ఆటగాడి పైన నాలుగు సంవత్సరాల నిషేధం ఉంది. అయితే ఆ నిషేధం వచ్చే ఏడాది జులై తో ముగిసిపోనుంది.  అయితే ఒకవేళ ఈ ఏడాదే పోటీలు జరిగిఉంటే అతనికి అవకాశం ఉండేది కాదు. అందువల్ల అతను తిరిగి ఒలంపిక్స్ లో పాల్గొనాలనుకుంటే మిమ్ము అతడిని అడ్డుకొం అని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) సహాయక కార్యదర్శి వినోద్ కుమార్ తెలిపారు.  అయితే నర్సింగ్ రెస్లింగ్ విభాగం 74 కేజీలు. అయితే నర్సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఎన్నికలో ప్రచారం చేశాడనే ఆరోపణలు మహారాష్ట్ర పోలీసుల దగ్గరి నుండి రావడం తో అతడిని సస్పెండ్ చేసిన విషయం అందరికి తెలుసిందే.