రూపాయికి దిక్కెవరు?

రూపాయికి దిక్కెవరు?

మార్కెట్‌ అంచనాలకు భిన్నంగా రూపాయి పతనం కావడంతో షేర్ మార్కెట్ కుప్పకూలింది. రూపాయి పతనం మున్ముందు ఉంటుందని, అయితే స్పీడుగా మాత్రం బలహీనపడదని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు చెబుతూ వచ్చారు. అయితే వీరి అంచనాలకు భిన్నంగా రూపాయి ఇవాళ యమ స్పీడుగా బక్కచక్కిపోయింది. ఒకదశలో స్పాట్ మార్కెట్‌లో డాలర్ కు రూపాయి విలువ 72.74కి క్షీణించింది. ఇక ఫ్యూచర్స్ మార్కెట్ లో రూపాయి విలువ 72.88కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్, క్రూడ్ ఆయిల్ స్థిరంగా ఉన్నా రూపాయి క్షీణించడానికి ప్రధాన కారణం విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు. గత కొన్ని నెలలుగా షేర్‌ మార్కెట్‌ నుంచి వైదొలగుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇపుడు బాండ్ మార్కెట్ల నుంచి కూడా వైదొలగుతున్నారు. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగింది.