థియేటర్‌లో సినిమా చూసే అనుభూతికి మరేదీ సాటిరాదు..

థియేటర్‌లో సినిమా చూసే అనుభూతికి మరేదీ సాటిరాదు..

కరోనా వల్ల సినిమాకి, సినిమావాళ్లకి నిజంగానే సినిమా కష్టాలు వచ్చాయి'' అన్నారు దర్శకుడు వైవీఎస్‌ చౌదరి.ప్రధానంగా సినిమా రంగంపై కరోనా ప్రభావం భారీగా పడింది. సినిమా థియేటర్లు, మాల్స్ మూతపడి భారీగా నష్టాలను చవిచూసేలా చేసింది. సినిమా రిలీజ‌్‌లు, షూటింగ్‌లు వాయిదా పడేలా చేసి మరింత కష్టాల ఊబిలోకి నెట్టేసింది. తద్వారా పనులు లేక సినీ కార్మికులు పస్తులుండే పరిస్థితిని తీసుకొచ్చింది.తాజాగా దర్శకుడు వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ.. ''సినిమాకు కష్టాలు రావడం కొత్తేం కాదు. కేబుల్‌ టీవీ, సీడీ, డీవీడీ ప్లేయర్స్, సీరియల్స్, గేమ్‌ షోస్, క్రికెట్, ఐపీఎల్, యూట్యూబ్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌.

వీటన్నింటినీ తట్టుకొని సినిమా థియేటర్‌లో నిలబడుతూనే ఉంది. నిశ్చింతగా, నిశ్చలంగా ఉండటం సినిమాకి చేతకాదు. సముద్రపు అలలాగా పడినా పైకి లేవడం సినిమాకి తెలుసు. కోవిడ్‌ కాదు దానికంటే ప్రమాదకరమైనది వచ్చినా థియేటర్‌లో సినిమా చూడాలనే ప్రేక్షకుడి కాంక్షను ఆపలేదు. థియేటర్‌లో సినిమా చూసే అనుభూతికి మరేదీ సాటిరాదు.అని  వైవీఎస్‌ చౌదరి అన్నారు.