పలమనేరు - పలమనేరు

పలమనేరు
పలమనేరు

2014 సాధారణ ఎన్నికలలో పలమనేరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి ఎన్.అమరనాథరెడ్డి మరోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఆర్.వి. సుభాష్ చంద్రబోస్ పై 2890 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  టిడిపి తరపున మూడుసార్లు గెలిచిన అమరనాధరెడ్డి 2009లో గెలిచిన తర్వాత వైసిపిలోకి వెళ్లారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి అనర్హత వేటుకు గురయ్యారు. అంతకుముందు అమరనాధరెడ్డి రెండుసార్లు పుంగనూరులో గెలవగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పలమనేరులో రెండుసార్లు విజయం సాధించారు. అమరనాధరెడ్డి తండ్రి ఎన్.రామకృష్ణారెడ్డి పుంగనూరులో మూడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు చిత్తూరు ఎంపిగా టిడిపి తరపున గెలిచారు. అయితే తర్వాత కాలంలో వైసిపిలో జరిగిన పరిణామాలతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరారు అమరనాధరెడ్డి . అనంతరం చంద్రబాబు మంత్రివర్గంలో చేరి సభ్యునిగా కొనసాగుతున్నారు. 
పలమనేరుకు 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఐదుసార్లు, టిడిపి ఆరుసార్లు, ఒకసారి వైసిపి గెలిచాయి. ఒకసారి స్వతంత్ర పార్టీ గెలుపొందింది. టిడిపి నేత పట్నం సుబ్బయ్య పలమనేరులో మూడుసార్లు గెలిచారు. సుబ్బయ్య కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. 1952లో పలమనేరు జనరల్ గా ఉన్నప్పుడు గెలిచిన రామబ్రహ్మం , తర్వాత కుప్పంలో మరోసారి గెలిచారు. 

Activities are not Found
No results found.