బడ్జెట్ 2020-21

బడ్జెట్ 2020-21 కేటాయింపులు:

 • విద్యారంగానికి రూ.99,300 కోట్లు
 • ఆరోగ్య రంగానికి రూ.69వేల కోట్లు
 • జౌళిరంగానికి రూ.1,480 కోట్లు
 • ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6,400కోట్లు
 • జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ.11,500కోట్లు
 • స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.12,300 కోట్లు
 • పౌష్టికాహార పథకం కోసం రూ.35,600 కోట్లు
 • నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్వాంటమ్‌ టెక్నాలజీస్‌కు రూ.8వేల కోట్లు
 • భారత్‌ నెట్‌ పథకానికి రూ.6వేల కోట్లు
 • రవాణా, సదుపాయాల అభివృద్ధికి రూ.1.7లక్షల కోట్లు
 • బెంగళురులో రూ.18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే 
 • నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3వేల కోట్లు
 • మహిళలు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు రూ.28,600 కోట్లు
 • గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83లక్షల కోట్లు
 • నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400 కోట్లు
 • పర్యాటక రంగ అభివృద్ధికి రూ.2వేల కోట్లు
 • సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రూ.9,500 కోట్లు
 • ఎస్టీల కోసం రూ.53వేల కోట్లు
 • ఎస్సీలు, ఓబీసీలకు రూ.85వేల కోట్లు

అదనపు నిధుల కేటాయింపునకు కొత్త పథకం

 • ప్రభుత్వ రంగ బ్యాంకులకు 3.5 లక్షల కోట్ల మూలధనసాయం
 • డిపాజిట్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు
 • కంపెనీ చట్టంలో మార్పులు
 • బ్యాంకింగేతర హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు అదనపు నిధుల కేటాయింపునకు కొత్త పథకం
 • ప్రభుత్వ సెక్యురిటీల్లో పెట్టుబడులకు ఎన్‌ఆర్‌లకు అవకాశం
 • ఆర్థిక ఒప్పందాల పర్యవేక్షణకు కొత్తం చట్టం
 • స్టాక్ మార్కెట్లకు శుభవార్త
 • రూ. 100 కోట్ల టర్నోవర్ వరకు స్టార్టప్‌లకు రాయితీలు
 • హౌసింగ్‌కు ప్రోత్సాహకం
 • డెవలపర్లకూ రాయితీ పొడిగింపు
 • ఛారిటీ సంస్థలు ఇక ఐటీశాఖ వద్ద నమోదు
 • వివరాళు ఇచ్చేవారికి మరింత ప్రోత్సాహకం
 • అఫోర్డబుల్ హౌసింగ్‌కు ట్యాక్స్ హాలిడే పొడిగింపు
 • 31 మార్చిలోగా బకాయిలన్నీ చెల్లిస్తే నో పెనాల్టీ

ఇన్‌కంట్యాక్స్ పేయర్స్‌కి ఊరట

 • ఆదాయం రూ.5 లక్షల నుంచి 7.5 లక్షలు ఉన్నవారికి 10శాతం పన్ను
 • రూ.7.5 లక్షల నుంచి రూ. 10లక్షల వరకు ఉంటే 15శాతం పన్ను
 • రూ.10లక్షల నుంచి రూ. 12.5 లక్షల వరకు 20శాతం
 • రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షలు ఉంటే 30 శాతం పన్ను
 • రూ. 15 లక్షలకు పైన ఉంటే ఎలాంటి మార్పు లేదు... 30 శాతం పన్ను

 

 • ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ వాటాల విక్రయానికి నిర్ణయించాం
 • ఎల్‌ఐసీని స్టాక్‌మార్కెట్‌లో లిస్టింగ్‌కు తీసుకురానున్నాం

దేశ భద్రత ప్రథమ కర్తవ్యం

 • తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలు... రోగ రహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత
 • ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్‌భారత్‌
 • రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయ జీవితం, సందప సృష్టికర్తలపై గౌరవం
 • దేశ భద్రత అంశాల్లో దేశం ఎంతో అభివృద్ధి సాధించింది.

జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌కు ప్రత్యేక నిధులు

 • జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి 30,750కోట్లు
 • లద్దాఖ్‌కు 5,958కోట్లు
 • భారత్‌లో 2022లో జరిగే జీ-20 సమావేశాలకు 100కోట్లు

పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు

 • డిపాజిట్ ఇన్యూరెన్స్ కవరేజ్ రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
 • పన్ను చెల్లింపుదారులను కాపాడతాం
 • పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి వేధింపులు ఉండవు
 • ప్రభుత్వ రంగ సంస్థల్లో మరిన్ని ఉద్యోగాలు
 • పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు
 • పర్యాటకరంగ అభివృద్ధికి 2వేల కోట్లు

పురావస్తు కేంద్రాల అభివృద్ధి

 • వారసత్వ పరిరక్షణకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ కన్జర్వేషన్‌
 • ఐదు పురావస్తు కేంద్రాల ఆధునీకీకరణ, అభివృద్ధి
 • హరియాణాలోని రాఖీగడ, యూపీలోని హస్తినాపూర్‌ అభివృద్ధి
 • అసోంలోని శివసాగర్‌, గుజరాత్‌లోని ధోలావీర, తమిళనాడులోని ఆదిత్య నల్లూరు అభివృద్ధి

బడ్జెట్ కేటాయింపులు:

 • ఎస్సీలు, ఓబీసీలకు 85వేల కోట్లు కేటాయింపు 
 • సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు 9,500కోట్లు
 • పౌష్టికాహార పథకం కోసం 35,600కోట్లు
 • మహిళలు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు 28,600కోట్లు

బడ్జెట్ కేటాయింపులు లైవ్ అప్‌డేట్స్... 

 

జాతీయ గ్రిడ్‌తో లక్ష గ్రామల అనుసంధానం

 • ప్రతి గ్రామ పంచాయతీకి భారత్‌నెట్‌తో అనుసంధానం
 • నేషనల్‌ గ్యాస్‌ గ్రిడ్‌ను 16,300 కి.మీ. నుంచి 27వేల కి.మీ.లకు పెంచే దిశగా చర్యలు
 • దేశవ్యాప్తంగా డేటా సెంటర్‌ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం
 • ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఫైనాన్షియల్‌ టెక్నాలజీలో కొత్త సంస్కరణలకు మరిన్ని చర్యలు
 • లక్ష గ్రామాలకు ఓఎఫ్‌సీ ద్వారా డిజిటల్‌ కనెక్టివిటీ
 • జాతీయ గ్రిడ్‌తో లక్ష గ్రామల అనుసంధానం

100 విమానాశ్రయాల అభివృద్ధి:

 • 2024 నాటికి మరో 100 విమానాశ్రయాల అభివృద్ధి
 • విద్యుత్‌ మీటర్ల స్థానంలో స్మార్ట్‌ మీటర్లు
 • నూతన ఆవిష్కరణలు నూతన ఆర్థిక వ్యవస్థకు కీలకం
 • నదీతీరాల్లో ఆర్థికాభివృద్ధి
 • ఐవోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనలటిక్స్‌ కోసం నూతన విధానం

హైస్పీడ్‌ రైలు:

 • రైలు మార్గాల ఇరు పక్కల సోలార్‌ కేంద్రాల ఏర్పాటు
 • పర్యాటక కేంద్రాలతో తేజస్‌ రైళ్లు
 • 11 వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ
 • ముంబై - అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు

2 వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం:

 • చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే
 • 2 వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణమే లక్ష్యం
 • బెంగళూరుకు రూ. 18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్‌ రైల్వే వ్యవస్థ
 • కేంద్రం 20శాతం, అదనపు నిధుల ద్వారా 60శాతం సమీకరణ

నూతన పథకం:

 • ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీకి పెట్టుబడులు అవసరం
 • సెల్‌ఫోన్లు, సెమీ కండక్టర్లు, వైద్య పరికరాల ఉత్పత్తి ప్రోత్సాహానికి ఒక నూతన పథకం
 • ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా మారుస్తాం
 • జాతీయ మౌలిక సదుపాయాల్లో భాగంగా 103 లక్షల కోట్లు

బడ్జెట్ 2020-21 కేటాయింపులు

 • రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్త 5 స్మార్ట్ సిటీస్
 • నూతన పరిశ్రమల వ్యవస్థాపకత మనకున్న బలం
 • స్టార్టప్‌లకు ప్రోత్సాహం
 • నైపుణ్య శిక్షణకు 3వేల కోట్లు
 • యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు
 • నేషనల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌క 1480కోట్లు
 • జాతీయ జౌళి సాంకేతికత మిషన్‌ ద్వారా కొత్త పథకం
 • చిన్న తరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్‌ పేరుతో బీమా పథకం
 • ప్రతి జిల్లాను ఒక ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా రూపొందించాలనేది ప్రధాని ఆలోచన
 • అంతర్జాతీయ వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్లు

బడ్జెట్ కేటాయింపులు లైవ్ అప్‌డేట్స్... 

 

కొత్త విద్యా విధానం

 • భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం ‘ఇండ్‌శాట్‌’
 • త్వరలో కొత్త విద్యా విధానం
 • విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
 • నేషనల్‌ పోలీస్‌ వర్సిటీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ వర్సిటీ ఏర్పాటు
 • 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు

బడ్జెట్ ప్రవేశపెడుతోన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Image

రోగాల నివారణకు నూతన పథకం 

 • జీవన మార్పులతో వచ్చే రోగాల నివారణకు నూతన పథకం 
 • జీవ ఔషధి కేంద్రాల విస్తరణకు చర్యలు

బడ్జెట్ 2020-21 కేటాయింపులు

 • ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయింపు
 • జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ. 3.06లక్షల కోట్లు
 • స్వచ్ఛ భారత్‌కు రూ. 12,300 కోట్లు

ఉద్యాన పంటలకు అదనపు నిధుల 

 • కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపులు, ఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు
 • మత్స్య సంపదను పెంపొందించేందుకు చర్యలు
 • సాగర్‌ మిత్ర పథకంలో గ్రామీణ యువ రైతులకు మత్స్య పెంపకంలో ప్రోత్సాహం
 • పేదరికం నిర్మూలనకు స్వయం సహాయక సంఘాల చేయూత
 • మత్స్య సంపద ఎగుమతుల లక్ష్యం 200 లక్షల టన్నులు

యూనియన్ బడ్జెట్ 2020-21

 • నీటి కొరత తీవ్రంగా ఉంది 
 • 100 జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి
 • రైతులకు సోలార్‌ పంప్‌సెట్ల పథకాన్ని మరో 20 లక్షల మందికి విస్తరిస్తున్నాం
 • సాగులేని భూముల్లో సోలార్‌ కేంద్రాలతో రైతులకు ఆదాయం వస్తుంది
 • వేల సంవత్సరాల క్రితమే తమిళ మహాకవి అవ్వయ్యార్‌ నీటి సంరక్షణ, భూమి వినియోగం గురించి వెల్లడించారు
 • ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్‌ఎస్‌జీలకు సాయం
 • కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్‌ యోజన
 • వర్షాభావ జిల్లాలకు అదనంగా నిధులు, వర్షాభావ జిల్లాలకు సాగునీటి సౌకర్యం
 • రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి
 • భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణలు
 • రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం.. గిడ్డంగుల నిర్మాణానికి నాబార్డు ద్వారా సాయం
 • పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం
 • మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి పథకం అమలు

యూనియన్ బడ్జెట్ 2020-21

 • మొదటి ప్రాధాన్యాంశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
 • రెండో ప్రాధాన్యాంశంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
 • మూడో ప్రాధాన్యాశంగా విద్య, చిన్నారుల సంక్షేమం
 • పప్పుధాన్యాలసాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం
 • కృషి సించాయీ యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం
 • గ్రామీణ సడక్‌ యోజన, ఆర్థిక సమ్మిళిత విధానాలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి
 • ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అందరికీ ఆవాసం
 • ఇప్పటివరకూ 40 మంది జీఎస్టీ రిటర్న్‌లు దాఖలు చేశారు.
 • న్యూఇండియా సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, ప్రజా సంక్షేమం.. అనే మూడు లక్ష్యాలతో ముందుకు
 • భారత్‌ ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది 
 • కేంద్ర రుణభారం 48.7శాతానికి తగ్గింది 
 • రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెండింతలు చేస్తాం
 • 6 లక్షలకు పైగా రైతులు ఫసల్‌ బీమా యోజనతో లబ్ధి పొందుతున్నారు
 • సంపదను సృష్టించడమే లక్ష్యం
 • వ్యవసాయరంగం అభివృద్ధికి 16సూత్రాల పథకం అమలు చేస్తాం

పార్లమెంట్‌లో ప్రవేశపెడుతోన్న నిర్మలా సీతారామన్

 • ఎకానమీని సంఘటితపరిచేందుకు చర్యలు
 • ఆరోగ్యకరమైన వాణిజ్య వృద్ధికి తోడ్పాటు
 • ప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపట్టింది
 • ద్రవ్యోల్బణం అదుపులో ఉంది
 • జీఎస్టీతో సామాన్యులకు నెలకు 4 శాతం వరకూ ఆదా
 • నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం
 • కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుంది
 • సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌ ఈ ప్రభుత్వ లక్ష్యం
 • ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి నేరుగా నిరుపేదలకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం
 • దేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి
 • ఒకే పన్ను, ఒకే దేశం విధానం మంచి ఫలితాలను ఇచ్చింది
 • ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కు కాలం చెల్లింది... ఇందులో భాగంగా అనేక చెక్‌పోస్టులు తొలగించాం
 • దాదాపు 10శాతం పన్ను భారం తగ్గింది
 • గత రెండేళ్లలో 16లక్షల పన్ను చెల్లింపుదారులు కొత్తగా చేరారు
 • ఏప్రిల్‌ 2020 నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళతరం అవుతాయి
 • ఇది సామాన్యుల బడ్జెట్‌
 • దేశ ప్రజలకు సేవ చేయాలనే దీక్షతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాం
 • జాతి నిర్మాణంలో యువత, మహిళ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర ఉంది
 • కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో బలోపేతమైన ఆర్థికవ్యవస్థగా భారత్‌ అవతరించింది 
 • మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి
 • గత ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి భారీ మెజార్టీతో అధికారం అప్పగించారు
 • ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌ 
 • యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉంటాయి
 • జీఎస్టీతో రాష్ట్రాల, కేంద్రం ఆదాయం పెరిగింది... ఎవరికీ నష్టం కలగలేదు

యూనియన్ బడ్జెట్ 2020-21

 • జీఎస్టీ విషయంలో అరుణ్ జైట్లీ ముందుచూపుతో వ్యవహరించారు
 • పాలనారంగంలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకువచ్చాం
 • ఆర్థికరంగ మూలాలు బలంగా ఉన్నాయి
 • ఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ చాలా కీలకమైనది
 • ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టాం
 • మేం అధికారంలోకి వచ్చాక ఆర్థిక సంస్కరణలు వేగవంతం చేశాం
 • పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2020-21 
 • బడ్జెట్ ప్రవేశపెడుతోన్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్‌కు చేరుకుంటున్న ఎంపీలు

Image

బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

యూనియన్ బడ్జెట్ 2020-21

 • ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
 • రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
 • తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
 • ఉద్యోగులు, రైతులు లక్ష్యంగా బడ్జెట్ 2020
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram