టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. కొత్త గెటప్‌లో ఆశ్చర్యపరిచాడు. సంప్రదాయ పంజాబీ దుస్తులు వేసుకుని.. తలకు టర్బన్‌ పెట్టుకుని ఫొటో దిగిన కోహ్లీ.. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. పంజాబీ కుటుంబానికి చెందిన విరాట్‌.. సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో.. క్షణాల్లో ఆ ఫొటో వైరల్ గా మారిపోయింది. టర్బన్‌ లుక్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన కోహ్లీ.. 'సత్ శ్రీ అకాల్ సారేయాన్ ను' అని క్యాప్షన్‌ పెట్టాడు.