ఆంధ్రప్రదేశ్ - CLICK HERE
- నియోజకవర్గాలు
- పాలకొండ
- కురపాం
- పార్వతీపురం
- సాలూరు
- అరుకు వేలి
- పాడేరు
- రంపచోడవరం

2014 సాధారణ ఎన్నికలలో పాలకొండ రిజర్వుడు నియోజకవర్గంలో వైసిపి విజయ కేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్ధి విశ్వాసరాయ కళావతి 1620 ఓట్ల ఆధిక్యతతో టిడిపి అభ్యర్ధి నిమ్మక జయకృష్ణను ఓడించారు. కళావతి గిరిజన రాజకీయ కుటుంబాలలో ఒకరైన విశ్వాసరాయ నరసింహరావు కుటుంబానికి చెందినవారు. పాలకొండ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు కేవలం 3162 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు. 2004లో ఇక్కడ గెలుపొందిన కంబాల జోగులు, రాజాంలో 2014లో తిరిగి గెలిచారు.
పాలకొండ నియోజకవర్గానికి 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి నాలుగుసార్లు, టిడిపి నాలుగుసార్లు, స్వతంత్ర పార్టీ రెండుసార్లు, జనతా ఒకసారి, వైసిపి ఒకసారి గెలిచాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు నెగ్గారు. పాలకొండ ఎస్సీలకు రిజర్వు అయినప్పుడు ఏపిపిఎస్సీ మాజీ సభ్యుడు తలే భద్రయ్య ఇక్కడ నుంచి రెండుసార్లు, పి.జె.అమృతకుమారి రెండుసార్లు గెలిచారు. ఒకసారి గెలిచిన కొత్తపల్లి నరసయ్య మరో రెండుసార్లు పొందూరు, ఎచ్చెర్లలో విజయం సాధించారు. పాలకొండ జనరల్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కసారి గెలిచిన పి.సంగంనాయుడు, ఉనుకూరులో మరోసారి విజయం సాధించారు. పాలకొండలో ఒకసారి గెలుపొందిన పి.నరసింహప్పారావు, అముదాలవలస, నగరికటకంలలోమూడుసార్లు గెలిచిన పైడి శ్రీరామమూర్తి, తండ్రి,కొడుకులు.2009లో పాలకొండలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన కళావతి 21వేలకు పైగా ఓట్లు తెచ్చుకుని ఓడిపోయినా, 2014లో ఆమె వైసిపి తరపున గెలుపొందగలిగారు.