ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

రామచంద్రా పురం
రామచంద్రా పురం

2014 సాధారణ ఎన్నికలలో టిడిపి అభ్యర్ధి తోట త్రిమూర్తులు విజయం సాధించారు. త్రిమూర్తులు తన సమీప వైసిపి అభ్యర్ధి పిల్లి సుభాష్ చంద్రోబోస్ పై 16922 ఓట్ల ఆధికత్యతతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జెవి.నందకు కేవలం 986 ఓట్ల మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. 2009లో త్రిమూర్తులు ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2004లో బోస్ తొలుత కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా ఉండగా, ఆ తరువాత ఆయననే కాంగ్రెస్ నాయకత్వం అధికార అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే అప్పటికే ఆయన ఇండిపెండెంటుగా నామినేషన్ వేసినందుకు ఆ ప్రకారమే ఉండి, కాంగ్రెస్ మద్దతుతో ఇండిపెండెంటు అభ్యర్ధిగా గెలుపొందారు. తదుపరి 2009లో గెలుపొంది వైఎస్ , రోశయ్య మంత్రివర్గాలలో బోస్ ఉన్నారు. ఈయన మొత్తం నాలుగుసార్లు గెలిచారు. బోసు 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసిపి తరపున 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గతంలో ఒకసారి ఇండిపెండెంటుగా, మరోసారి టిడిపి పక్షాన గెలిచిన తోట త్రిమూర్తులు, 2012లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున గెలిచారు. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలోకి వచ్చి మరోసారి గెలిచారు. 
రామచంద్రాపురం నియోజకవర్గానికి మొత్తం 17సార్లు ఎన్నికలు జరిగితే, త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకే వరుసగా రెండోసారి గెలిచే అవకాశం దక్కింది. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఇక్కడ ఐదుసార్లు, టిడిపి నాలుగుసార్లు, సిపిఐ, ప్రజాపార్టీ, కెఎంపిపి. ఒక్కొక్కసారి గెలిస్తే.. ఐదుగురు ఇండిపెండెంట్లు అభ్యర్ధులుగా విజయం సాధించారు. 1970లో జరిగిన ఉప ఎన్నికలో మల్లిపూడి శ్రీరామసంజీవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన తండ్రి పల్లంరాజు రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పని చేస్తే, సంజీవరావు కుమారుడు పల్లంరాజు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సంజీవరావు కూడా కేంద్రంలో మంత్రిగా పని చేశారు. 

Activities are not Found
No results found.